‘ఎల్లువొచ్చి గోదార‌మ్మ..’ ఫుల్ వీడియో సాంగ్ !

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హారీష్ ఆ రేంజ్ హిట్ ఇచ్చిన చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. వరుణ్ తేజ్ ఫుల్ మాస్ పాత్రలో అలరించారు. మాస్ ని మురిపించారు. ఈ యేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో గద్దలకొండ గణేష్ ఒకటిగా నిలిచింది. యాక్షన్, డైలాగ్స్ కూడా అదిరిపోయింది. ఫలితంగా గద్దలకొండ గణేష్ భారీ లాభాలని తీసుకొచ్చాడు.

ఈ సినిమా కోసం ‘దేవత’ సినిమాలోని సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదార‌మ్మ.. ‘ రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన తరహా రిమేక్ సాంగ్ లోనూ.. గోదావరి అంచున బిందేలతో అద్భుతంగా చిత్రీకరించారు. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. మీరు చూసి ఎంజాయ్ చేయండీ.. !