పూరి సినిమా ‘అర్జున్ రెడ్డి’ని మించేలా.. !!

పూరి హీరోలందరూ.. పోకిరీలే. ఆయన చేతిలో పడిన హీరో చెడిపోక తప్పదు. దేశ ముదురు, ఇడియట్, పోకిరి, లోఫర్ లా తయారవుతారు. కానీ, వారందరూ ప్రేక్షకులకి నచ్చుతారు. అదే పూరి మేజిక్. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ పూరి చేతిలో పడిన సంగతి తెలిసిందే. వీరి కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తారట. వచ్చే యేడాది జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలవ్వనుంది. 

ఇక ఈ సినిమా కోసం విజయ్ ని చెడగొట్టే పనిలో ఉన్నాడు పూరి. సిక్స్ ప్యాక్ బాడీతో.. ఓ బ్యాడ్ బోయ్ లా మారబోతున్నాడట.. విజయ్. ఒక మాటలో చెప్పాలంటే.. పూరి పాత్రలో విజయ్ ఇమడిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని మించేలా ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండనే చెప్పడం విశేషం. విజయ్ నిర్మాత చేసిన సినిమా మీకు మాత్రమే చెప్తా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్.. పూరి సినిమా గురించి గొప్పగా చెప్పారు. నా అభిమానులు ఎంజాయ్ చేస్తారు అన్నారు.