మహేష్’ని రెచ్చగొడుతున్న రస్మిక !


ముద్దుగుమ్మ రష్మిక మందన ముద్దులు చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే.. విజయ్ దేవరకొండ-రస్మిక లిప్ లాక్ లకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో వీరి లిప్ లాక్ లు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రస్మికతో మహేష్ లిప్ లాక్ చేయాల్సిందేననే డిమాండ్ తెరపైకి వచ్చింది. లేదంటే రస్మికని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వస్తాయన్నది ప్రిన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు, మహేష్ గాఢమైన ముద్దులు పెట్టిన దాఖలాల్లేవ్. 

బిజినెస్ మేన్ లో కాజల్ తో చేసిన ముద్దుసీన్ నే కాస్త చెప్పుకోదగ్గది. అదీకూడా కెమెరా ట్రిక్స్ తో కానిచ్చేశారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు రస్మిక మహేష్ ని టెప్ట్ చేస్తోంది. లిప్ లాక్ పెట్టేదాక వదలేలా లేదని కామెంట్స్ వినిపిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా తెలివైనవాడు. ఆయనకి కమర్షియల్ టిప్స్ బాగా తెలుసు. దీంతో.. మహేష్-రస్మిక లిప్ లాక్ ని ఎలాగైనా ప్లాన్ చేస్తాడని చెబుతున్నారు. మొత్తానికి.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్-రస్మికల లిప్ లాక్ ఉండబోతుంది. అది.. విజయ్ సినిమాల్లోని లిప్ లాక్ అంతకుమించేలా ఉండబోతుందని సమాచారమ్.