కేఏ పాల్ పాట.. విని నవ్వకుండా ఉండగలరా ?

కేఏ పాల్ కనిపిస్తే కామెడీకి కొదవుండదు. ఇక ఆయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతిలో పడితే.. ఇకేముంది ? కేఏ పాల్ కామెడీకి వర్మ పైత్యం కలిస్తే.. దబిడిదిబిడే. వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో ఈ సినిమా తెరక్కెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమైంది. ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ని వర్మ ఓ రేంజ్ లో టార్గెట్ చేసినట్టు కనబడింది.

అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ని వర్మ వదల్లేదు. తాజాగా, కేఏ పాల్ కి సంబంధించిన పాటని విడుదల చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కేఏపాల్ చేసిన కామెంట్స్‌ని అందులో పొందుప‌ర‌చి వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశారు. అవి ఫుల్లుగా నవ్వించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కేఏ పాల్ నే కమెడియన్ అన్నమాట. ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక ఇందులో వర్మ పవన్ ని ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.