ఆర్టీసీ సమ్మెపై కీలక పరిణామాలు


తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ కేభినేట్ సమావేశం జరగనుంది. ఆర్టీసీ సమ్మె ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారమ్. 50+30+20 ఫార్ములాకి కేభినేట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. 

ఇక తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్  కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుఠిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. లక్ష్మణ్‌ ఢిల్లీ వెళ్లే ముందు తెజస అధ్యక్షుడు కోదండరాం, ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ఈరోజు ఆర్టీసీ సమ్మెపై కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయ్. 

మరి.. అవి ప్రజల కష్టాలని తీర్చేలా ఉంటాయా ? ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమింపజేసేలా ఉంటాయా.. ?? లేదంటే.. సీఎం కేసీఆర్ చెప్పినట్టు అసలు ఆర్టీసీ లేకుండానే పోతుందా ?? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సాయంత్రంలోగా ఆర్టీసీ సమ్మెపై చోటు చేసుకొన్న పరిణాలపై క్లారిటీ రానుందని చెప్పవచ్చు.