వైజ‌నాథ్ పాటిల్ ఇకలేరు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వైజనాథ్ పాటిల్ (81) కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైజనాథ్ బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైజ‌నాథ్‌కు భార్య‌, ముగ్గురు కుమారులు, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.వైజనాథ్ మృతిపట్ల పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

 వైజనాథ్ 1984లో రామ‌కృష్ణ హెగ్డే ప్ర‌భుత్వం హార్టిక‌ల్చ‌ర్ మంత్రిగా చేశారు. 1994లో దేవ గౌడ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిగా ప‌నిచేశారు. క‌ర్నాట‌క‌-హైద‌రాబాద్ పోరాట స‌మితికి వైజనాథ్ పాటిల్ అధ్య‌క్షుడిగా చేశారు. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు విద్యా, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, వైజ‌నాథ్ పాటిల్‌లు కలిసి పోరాటం చేశారు. దాని ఫలితంగానే కేంద్రం ర్టిక‌ల్ 371(జే) చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. వైజనాథ్ గుల్బర్గా వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.