విజయ్.. తమ కడుపు కొడుతున్నాడు !
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిపై సాధారణ కిరణా వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్.. తమ కొడుతున్నారు. ఈ నెల 4వ తేదీన చెన్నైలోని విజయ్ సేతుపతి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంతకీ మేటర్ ఏటంటే ? కొంత కాలంగా విజయ్ సేతుపతి ఎక్కువగా ప్రకటనల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన ‘మండి’ అనే ఆన్ లైన్ కిరాణా సరకుల యాప్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనలు, వీడియోలు వస్తున్నాయి.
విజయ్ సేతుపతి ప్రకటనపై సాధారణ కిరాణా వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి దుకాణాలతో జీవనం సాగిస్తున్న తమ కడుపులు కొడుతున్న ఇలాంటి వ్యాపార సంస్థలకు విజయ్ సేతుపతి వంటి యువ నటుడు చేయూతనివ్వడం సముచితం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4న విజయ్ ఆఫీస్ ముందు ఆందోళనకి దిగేందుకు రెడీ అవుతున్నారు. మరీ.. వ్యాపారుల ఆందోళపై విజయ్ స్పందిస్తారా ? అన్నది చూడాలి.