బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సెలబ్రేషన్స్ వీడియో.. వైరల్ !

బిగ్ బాస్ 3కి నేడే ముగింపు. మరికొద్ది గంటల్లో (సాయంత్రం 6గం॥) ఫైనల్ ఏపీసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఐతే బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్ సిప్లగంజ్ నిలిచారు. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కంగ్రాట్స్ బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ అని వీడియోలో పేర్కొన్నారు. ‘ఆటా చూడు.. పాటా చూడు.. ‘ బీట్ కు అభిమానులతో కలిసి రాహుల్ చిందేస్తున్నాడు. వీడియోలో భారీగా జనాలు కనిపిస్తున్నారు. ఈ వీడియో చూస్తే.. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ అన్నది నిజమే అనిపిస్తోంది.

కానీ, రెండ్రోజుల క్రితం కూడా బిగ్ బాస్ 3 శ్రీముఖి అంటూ కొన్ని ఫోటోస్ బయటికొచ్చాయ్. అందులో కింగ్ నాగార్జున చేతుల మీదుగా శ్రీముఖి బిగ్ బాస్ 3 టైటిల్ ని అందుకొంది. ఆ తర్వాత తెలిసింది అది మార్పింగ్ ఫోటో అని. ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్3 అంటూ వైరల్ అవుతోన్న వీడియో వర్జినల్ నా ? లేక ఫ్యాన్ మేడెడ్ నా ?? అన్నది తెలియాల్సి ఉంది. ఓటింగ్ విషయంలో రాహుల్ ముందన్నట్టు మొదటి నుంచి వార్తలొస్తున్నాయ్. అదే నిజమైతే.. ఈ వైరల్ వీడియో కూడా నిజమే కావొచ్చేమో.. !