బ్రేకింగ్ : బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ 


ఊహించినదే జరిగింది. బిగ్ బాస్ 3 టైటిల్ కోసం శ్రీముఖి, రాహుల్ ల మధ్య గట్టిపోటీ ఉంటుందని బిగ్ బాస్ అభిమానులు భావించారు. ఐతే, చివరి వారంలో మాత్రం రాహుల్ నే బిగ్ బాస్ 3 విజేత అని తేల్చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. ఫైనల్ ఏపీసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ టైటిల్ ని అందుకొన్నారు.

ఫైనల్ కి చేరిన ఐదుగురు రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేష్, శ్రీముఖీ, అలీ రెజాలలో ముందుగా అలీ రెజా ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత వరుణ్ సందేష్ ఎలిమినేట్ అయ్యారు. టైటిల్ గెలుస్తాడని భావించిన బాబా భాస్కర్ టాప్ -3 కంటెస్టెంట్ గా ఎలిమినెట్ అయ్యారు. ఇక టైటిల్ పోరు రాహుల్, శ్రీముఖిల మధ్య జరిగింది. ఉత్కంఠ క్షణాల మధ్య రాహుల్ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.