బిగ్ బాస్ బంపర్ ఆఫర్ : రూ. 10లక్షలతో ఉడాయించొచ్చు !

బిగ్ బాస్ 3 ఫైనల్స్ కి వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఫైనల్ ఏపీసోడ్ ప్రారంభం అయింది. ఈ సారి కింగ్ నాగార్జున మరింత ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులందరూ స్టేజ్ పై సందడి చేశారు.డ్యాన్సులతో అదరగొట్టేశారు. బిగ్ బాస్ 3లో పాల్గొన్న తర్వాత తమకి ఆఫర్లు పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు.
 
ఇక బిగ్ బాస్ 3 విజేతని ప్రకటించే క్రమంలో షోని రక్తికట్టిస్తున్నారు నాగ్. ముందుగా హీరో శ్రీకాంత్ ని రూ. 20 లక్షలు ఇచ్చి బిగ్ బాస్ ఇంట్లోకి పంపించి.. సభ్యులని టెప్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్కోక్క బాక్స్ లో రూ. 10 లక్షలు, రెండు బాక్సుల్లో కలిపి 20 లక్షలు. ఇంటి సభ్యులు ఓ బాక్స్ ని తీసుకొని బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోవచ్చనే ఆఫర్ ఇచ్చారు నాగ్. దీంతో ఇంటి సభ్యులు ఆలోచనలో పడ్డారు. ఇంట్లో ఉన్నది ఐదురుగురు.. వీరిలో ఎవరికి వారే విజేత అనుకొంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బంపర్ ఆఫర్ పై ఆలోచిస్తున్నారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, కేథరిన్, అంజలి ఫెర్ ఫామెన్స్ చేయాల్సి ఉంది.