మెగాస్టార్ సినిమానికి నో చెప్పారట !

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల ప్రతిసినిమాకి దేవి శ్రీ సంగీతం అందించారు. ఇప్పుడు చిరుతో కొరటాల సినిమాకి ఆయన్ని పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే, అందులో వాస్తవం లేదట.

కొరటాల దేవినే తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ, దేవి వరుస సినిమాలతో బిజీ కావడం వలన కుదరదని చెప్పేశారట. ఇటీవల బాలీవుడ్ లో మంచి సంగీత ద్వయంగా పేరుగాంచిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను సంప్రదించడం జరిగిందట. అయితే వారికి మెగాస్టార్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశ ఉందని, కానీ ప్రస్తుతం వారు ఎంతో బిజీగా ఉండడం వలన ఆయన సినిమాకు పని చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో సైరా సినిమాకి సంగీతాన్ని అందించిన అమిత్ త్రివిది నే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.