రసవత్తరంగా తొలి టీ20 !

ఢిలీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బంగ్లా..  భారత్ ని మొదటి బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ని భారీ స్కోర్ చేయడకుండా కట్టడి చేయగలిగింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్స్ లో శిఖర్ ధావన్ 41, రిషబ్ పంత్ 27, శ్రేయస్ అయ్యర్ 22, రాహుల్, కృనాల్ పాండ్యలు 15 చొప్పున, వాషింగ్టన్ సుందర్ 14 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు షఫీవుల్ ఇస్లామ్ రెండు, అమినల్ ఇస్లామ్ రెండు, అఫిఫ్ హోసియన్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.

ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా పోరాడుతోంది. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లా 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఇంకా 9 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాస్ ఉత్కంఠగా సాగేలా కనిపిస్తోంది. మరీ.. బంగ్లా ఆటగాళ్లు భారత్ కి షాక్ ఇస్తారా.. ? లేదా టీమిండియా అనుభవం ముందు తలొగ్గుతారా ? అన్నది మరికొద్దిసేపట్లో తేలనుంది.