జనసేన లాంగ్‌మార్చ్‌లో అపశృతి

విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్‌ కు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి సెంట్రల్‌ పార్క్‌ వరకు పవన్ తో కలిసి నడిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే, లాంగ్ మార్చ్ లో విషాదం అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభ వద్ద బారికేడ్లకు విద్యుత్ సరఫరా అయ్యింది. బహిరంగ సభ వద్ద ఇద్దరు కార్యకర్తలకు విద్యుదాఘాతంతో స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో సభా వేదిక మినహా ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక లాంగ్ మార్చ్ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక సంక్షోభం వలన 26 మంది చనిపోయారంటే బాధగా ఉందన్న పవన్ వైసీపీ వాళ్ళు నాకేమీ శత్రువులు కాదని, ఇసుక అంటే అభివృద్ధి అని.. అది ఐదు నెలలలో కంటికి కనిపించకుండాపోయిందన్నారు. పవన్ మంచి పాలన అందిస్తే.. తాను హాయిగా సినిమాలు చేసుకొంటానని చెప్పడం విశేషం.