బిగ్ బాస్ 3 స్టేజ్ పై మెగాస్టార్ సందడి !

బిగ్ బాస్ 3 ఫైనల్ ఏపీసోడ్ గురించి జరిగిన ప్రచారం అంతా నిజం అవుతుంది. బిగ్ బాస్ 3 ముగింపు వేడుక వేదికపై హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, కేథరిన్, అంజలి డ్యాన్స్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. నిజంగానే హాట్ హీరోయిన్స్ బిగ్ బాస్ 3 ముగింపు వేడుకల్లో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 3 టైటిల్ ప్రధానోత్సవం ఉండనుందన్నారు. ఇప్పుడే మెగాస్టార్ బిగ్ బాస్ 3 స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు.

మరికొద్ది క్షణాల్లో బిగ్ బాస్ 3 విన్నర్ ని ప్రకటించనున్నారు. ఫైనల్ కి చేరిన ఐదురుగు సభ్యుల్లో ఇప్పటికే అలీ రెజా, వరుణ్ తేజ్, బాబా భాస్కర్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక శ్రీముఖీ, రాహుల్ లలో ఒకరిని మెగాస్టార్ చిరంజీవి విజేతగా ప్రకటించనున్నారు. ఈ ఇద్దరిలో రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అనే ప్రచారం జరిగింది. మరీ అదే నిజమవుతుందా.. ? సప్రైజ్ గా శ్రీముఖీ విన్నర్ గా నిలవనుందా ? కొన్ని నిమిషాల్లో తేలనుంది.