ఇకపై వాట్సాప్.. రెండు డివైజ్’లలో లాగిన్ !

వాట్సాప్‌ త్వరలో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటి వరకు  రిజిస్టర్‌ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే వాట్సాప్‌ లాగిన్ కాగలం. వేరొక డివైజ్‌లో లాగిన్‌ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టర్‌ అయిన డివైజ్‌ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ డివైజ్‌లలో లాగిన్‌ అవటం సాధ్యపడదు. ఐతే, త్వరలోనే ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్‌ అవ్వగలిగే ఫీచర్‌ని వాట్సాప్‌ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారమ్. దీంతోపాటుగా డార్క్‌మోడ్‌ ఫీచర్‌ని తీసుకు రానున్నారు.

అంతేకాకుండా గ్రూప్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా కొత్త ఫీచర్‌ని తేనుందని సమాచారమ్. దీనిలో ఉన్న బ్లాక్‌లిస్ట్‌ సహాయంతో గ్రూప్‌లో చేరమని ఇన్విటేషన్ రిక్వెస్ట్‌ పంపే వారిని బ్లాక్‌ చేయవచ్చు. అయితే ముందుగా ఈ ఫీచర్‌ని ఐఫోన్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి తేనున్నారట. ఆ తర్వాత అన్ని ఫోన్ లలో ఈ ఫీచర్ ని అందుబాటులోకి తేనున్నారు. ఇక వాట్సాప్ సెక్యూరిటీ విషయంలోనూ వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది. ఫింగర్ ప్రింట్ పాస్ వర్డ్ గా పెట్టుకొనే ఆప్షన్ ని తీసుకురానున్నారు.