సైరా కలెక్షన్స్ ఫైనల్ రిపోర్ట్ – డిజాస్టరే.. !

బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాల తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన మరో ప్యాన్ ఇండియా సినిమా ‘సైరా’. రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా బాహుబలి రేంజ్ సినిమా అన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అన్నారు. చివరికి సైరా ప్లాప్ అంటున్నారు. ఫైనల్ రిపోర్ట్ నే నిజం. అవునూ.. సైరా భారీ నష్టాలని మిగిల్చింది. ఏకంగా రూ.43.45కోట్ల నష్టాలు తెచ్చింది. ఒక్క నైజాం, ఉత్తరాంధ్రలో అతి కూడా స్వల్ప లాభాలు తీసుకొచ్చింది. 

ఇక మిగిలిన అన్నీ చోట్లా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలే మిగిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సైరాకు రు.105 కోట్ల షేర్ వచ్చింది. తమిళ్‌, హిందీ, కన్నడం, కేరళలో సైరా డిజాస్టరే అయ్యింది. ఇక ఏరియాల వారీగా చూస్తే.. నైజాం రూ. 32.10 కోట్లు, సీడెడ్ రూ. 19 కోట్లు,ఉత్తరాంధ్ర రూ.  16.80 కోట్లు, ఈస్ట్ రూ. 8.35 కోట్లు, వెస్ట్ రూ.  6.65 కోట్లు, గుంటూరు రూ. 9.70 కోట్లు, నెల్లూరు రూ. 4.65 కోట్లు, కృష్ణా రూ. 7.70 కోట్లు వసూలు చేసింది. సైరా సినిమాని రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కోసం భారీగా ఖర్చు చేశారు. మరీ.. ఇప్పుడు వచ్చిన లాభాలని ఆయనే భరిస్తారా ? డిస్ట్రిబ్యూటర్స్ నెత్తిన వదిలేస్తాడా ? అన్నది తెలియాల్సి ఉంది.