అల.. టబు ఫస్ట్ లుక్ ప్లాన్ చేశారు !

సంక్రాంతి సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ అప్పుడే ప్రేక్షకుల్లో అలజడి సృష్టించింది. ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలకి మంచి స్పందన దక్కింది. యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డుని సృష్టించాయి. తొలి పాట ‘సామజవరగమన’ 60మిలియన్ వ్యూస్ పైగా సొంతం చేసుకొంది. 7లక్షలకి పైగా లైకులు వచ్చాయ్. ఇక రెండో సాంగ్ ‘రాములో రాముల’ దాదాపు 40మిలియన్ వ్యూస్ సాధించింది. 5లక్షలకిపైగా లైకులు వచ్చాయ్. ఈ నేపథ్యంలో అల.. అంచనాలు ఆకాశాన్నంటాయ్. ఇప్పుడా అంచనాలని రెట్టింపయ్యేలా అల.. నుంచి నటి టబు ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు.

చాలా రోజుల తర్వాత తెలుగులో టబు నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఆమెకి మంచి పాత్ర దక్కిందని చెబుతున్నారు. సోమవారం (నవంబర్ 4) టబు పుట్టినరోజు కానుకగా అల.. వైకుంఠపురంలో నుంచి టబు లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఐతే, ఇది ప్రీ లుక్ మాత్రమే రేపు టబుకి సంబంధించి స్పెషల్ వీడియో రావొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ‘రాములో రాములో’ సాంగ్ లోనే టబు కనిపించారు. అల.. ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులకి దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ లెక్కన.. తాజా లుక్ ని టబు ఫస్ట్ లుక్ అనడం కన్నా.. బర్త్ డే లుక్ అనాలేమో.. ! ఇక, ఈ చిత్రంలో పూజా హెగ్డే, నభా నటాషా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.