ఏపీ సీఎస్ సడెన్ బదిలీ.. వెనక !

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయన్ని గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. 

ఏపీ సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. షోకాజ్ నోటీసులు అందుకునే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ  జారీ అవ్వడం. ఎల్వీ సుబ్రహ్మణ్యంక మరో ఐదునెలల సర్వీసు మాత్రమే ఉంది. ఈలోగానే ఆయన్ని బదిలీ చేశారు. మరీ.. నొచ్చుకొన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్ ప్రకటిస్తారా ? బదిలీ అయి గుంటూరు వెళ్తారా ? అనేది చూడాలి.