టబు బర్త్ డే లుక్ చూశారా ?

తివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ‘టబు’ పుట్టినరోజు సందర్భంగా ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. “ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడతాయి. ఆమె టాలెంట్‌లో ఎవరినైనా ఆకట్టుకోగలదు. టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. బర్త్ డే లుక్ లో టబు చిరు నవ్వులు చిందిస్తూ నిజంగానే అందంగా కనిపిస్తున్నారు.

తెలుగులోనూ టబుకి చాలామంది అభిమానులు. ఇక్కడ ఆమె స్టార్ తో ఆడిపాడింది. ‘కూలీ నెం.1’ చిత్రంతో టబు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో స్టార్ డబ్ సొంతం చేసుకొన్నారు. ప్రేమికులరోజు, బాలకృష్ణ ‘పాండురంగడు’ చిత్రంలో టబు నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ.. మెప్పిస్తున్నారు. ఇక అల.. వైకుంఠపురంలో సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఏరికోరి టబుని తీసుకొచ్చారు. ఇందులో ఆమె పాత్ర బలంగా ఉండనుందట. ఈ సినిమా హిట్ అయితే.. ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేయొచ్చని చెబుతున్నారు.