ఇలియానా ఫన్ కోసమే లవ్ చేసిందట !

గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు. సైలైంట్ గా కాపురం చేస్తున్నారనే వార్తలొచ్చాయ్. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఈ జంటగా విడిపోయింది. దీంతో.. ఇలియానా మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది. గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ లో మళ్లీ బిజీ కావాలని ఆశపడుతోంది. ఆ దిశగా సీరియస్ గా ప్రయత్నాలు కూడా చేస్తోంది. 

ఈ విషయం పక్కనపెడితే.. ఇటీవల తాను చేసిన రిలేషన్ షిప్ లపై ఓపెన్ గా మాట్లాడేస్తోంది. తాను చాలా మందితో రిలేషన్ పెట్టుకొన్నా. కానీ ఎవరు తన కోరిక తీర్చలేదు. తనకి పూలు అంటే చాలా ఇషం. ఏ బోయ్ ఫ్రెండ్ తన కోసం పూలు తీసుకురాలేదని వాపోయింది.తాజాగా “పాగల్ పాంటీ” సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇల్లీ మరో ఆసక్తికర విషయం చెప్పింది.
 
ఏదో ఫన్ కోసం ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్లి.. క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ .. మంచి మ్యూజిక్ వింటూ ఇద్దరం కలిసి ఎంటర్ టైన్ అవ్వాలనే విధంగా .. దాని తర్వాత ఇంట్లో దింపడం వరకే. అది మాత్రమే వర్కవుట్ అవుతుంది. రిలేషన్ షిప్స్ కొన్ని ఆదర్శవంతంగా మారవని చెప్పుకొచ్చింది. ఇల్లీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఆండ్రూని ఫన్ కోసమే లవ్ చేసిందనే విషయం అర్థమవుతోంది.