పవన్ అభిమానులు జగన్ కి సపోర్ట్ !

వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదు. పవన్ కి సినీ అభిమానులే ఎక్కువ. పవన్ రాజకీయాల్లోకి వెళ్లేప్పుడు వద్దని వారించిన అభిమానుల లిస్టు పెద్దదే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏంటో తెలిశాక.. పవన్ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకొన్నది అభిమానులే. పవన్ కి రాజకీయంగా సపోర్ట్ చేస్తున్న అభిమానులు కూడా పవన్ మళ్లీ సినిమాలు చేయాలని కోరారు. చివరికి వారి కోరికని తీరుస్తూ పవన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. పింక్ తెలుగు రిమేక్ లో నటించబోతున్నారు.

ఈ విషయం పక్కనపెడితే ఆదివారం సాయంత్రం విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అద్భుతంగా పాలిస్తే నేను సినిమాలు చేసుకుంటానని పవన్ అన్నారు. జగన్ పాలన వైఫల్యంతోనే నేను ప్రజల మధ్యకు రావలసి వస్తుందన్నారు. పవన్ నుంచి ఈ మాటలు విన్న ఆయన అభిమానులు కొందరు సంతోషిస్తున్నారు. అరే.. జగన్ మంచి పాలన ఇస్తే పవన్ ఎప్పుడు సినిమాలు చేస్తాడుగా.. మమ్మల్ని అలరిస్తాడుగా అని ఆశపడుతున్నారు. ఈ విషయంలో కొందరుపవన్ అభిమానులు బాహాటంగానే జగన్ ని సపోర్ట్ చేస్తారనడంలో అతిశయోక్తి లేదేమో.. !

ఇక ఆదివారం జరిగిన జనసేన లాంగ్ మార్చ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఐతే, ఈ లాంగ్ మార్చ్ ని టీడీపీ హైజాక్ చేసినట్టు అనిపించింది. పవర్ పవన్ ది. క్రెడిట్ టీడీపీది అన్నట్టుగా కనిపించింది. జనసేన లాంగ్ మార్చ్ మూడులో జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్ లు ఇచ్చారు. తమ మాటలని జనాలకి వినిపించేలా చేసుకొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జనసేన లాంగ్ మార్చ్  తో టీడీపీకి వాయిస్ వచ్చిందని చెప్పవచ్చు.