అన్నయ్య హీరోయిన్’తో తమ్ముడు.. !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల కోరికని తీర్చబోతున్న సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ సినిమాలు చేసేందుకు అంగీకరించారు. ‘పింక్’ తెలుగు రిమేక్ లో నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు ‘పింక్’లో పవన్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు ? అనేది హాట్ టాపిక్ గా మారింది.

చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయ్. స్టార్ హీరోయిన్ నయనతార పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైరాలో హీరోయిన్ గా నటించింది నయన్. ఈ నేపథ్యంలో అన్నయ్య హీరోయిన్ తో తమ్ముడు సినిమా చేయబోతున్నారని చెప్పుకొంటున్నారు. పింక్ తో పాటు పవన్ మరో సినిమాని చేయబోతున్నట్టు సమాచారమ్. 

ఇప్పటికే క్రిష్ చెప్పిన కథని పవన్ ఓకే చేశారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పింక్ తో పాటు క్రిష్ సినిమాలో పవన్ నటిస్తారని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు. ఇదో పిరియాడిక్ డ్రామా అని చెప్పుకొంటున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలతో అభిమానులని అలరించాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కథలు వింటున్నారట.