‘తిప్పరా మీసం’ సెన్సార్ రిపోర్ట్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. నిక్కీ తంబోలి  హీరోయిన్. ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకుడు. రిజ్వాన్ నిర్మించారు. ఈ వారమే (నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. 

ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “మదర్ సెంటిమెంట్ వున్న సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో తల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రను రోహిణి గారు పోషించారు. దర్శకుడు కృష్ణ విజయ్ నా పాత్రను గురించి చెప్పినప్పుడు, నాలో ఆయనకి ఈ యాంగిల్ కనిపించిందా అని అనుకున్నాను. అవుట్ పుట్ చూశాక నాతోనే ఆయన ఈ పాత్రను ఎందుకు చేయించారనేది అర్థమైంది” అన్నారు.