కత్తులతో దాడి చేసుకున్న తెరాస-కాంగ్రెస్ వర్గీయులు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. తెరాస, కాంగ్రెస్ వర్గీయుల కర్రలు, కత్తులతో దాడులుచేసుకొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారమ్.గుమ్మడవెల్లి గ్రామ ఎస్సారెస్పీ కాల్వకు సంబంధించిన నీటి విషయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన గేట్ వాల్ లైన్ కాకుండా.. మరో గోతు తవ్వారని మొదలైన గొడవ పెరిగి పెద్దదై.. కత్తులతో దాడి చేసుకొనే వరకు వచ్చింది. పైప్లైన్ పక్కన మరో గోతు తవ్వింది కాంగ్రెస్ వర్గీయులేనని తెరాస, తెరాస వర్గీయులేనని కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇరువర్గాల దాడిలో టీఆర్ఎస్ సర్పంచ్ వల్లపు యాకయ్య అనుచరుడు మల్లికంటి రమేశ్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారమ్. గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్టు తెలిసింది. 

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొంది. ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షోకాజ్‌ ఇవ్వడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు.