నాని సాలీడ్ గా ఇస్తాడట !

వైలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్ గా ఇస్తా అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. సుధీర్ బాబు, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ ఇంద్రగంటి దర్శకుడు. నివేదా థామస్, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేటుని ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఉగాదికి కానుకగా మార్చి 25న రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ పై “ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు – విలియమ్ షేక్స్ పియర్ నా శత్రువులందరూ.. జాగ్రత్తగా ఉండండి  వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు” అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ పై స్పందించిన నాని వైలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్ గా ఇస్తా.. అని కామెంట్ పెట్టారు. ఈ సినిమాలో నాని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. విధ్వంసకర విలన్ గా నానిని కనిపించేలా ఉన్నాడు.