బిగ్ బాస్ ఎఫెక్ట్ : బాబా భాస్కర్ ఫ్యామిలీలో గొడవలు
బిగ్ బాస్ తెలుగు సీజన్-3 విజయవంతంగా ముగిసింది. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. దాంతో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. ఆయన అభిమానులు పండగ చేసుకొంటున్నారు. రాహుల్ ఒక్కరే కాదు.. బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ ఆధారణ పెరిగింది. అవకాశాలు పెరిగాయి. ఈ విషయాన్ని ఫైనల్ ఏపీసోడ్ లో స్వయంగా వారే చెప్పిన సంగతి తెలిసిందే. అందరి సంగతి ఎలా ఉన్నా.. బాబా భాస్కర్ పరిస్థితియే దారణంగా తయారైందట.
బిగ్ బాస్ ఎఫెక్ట్ తో బాబా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఇంట్లో బాబా.. ఓ కంటిస్టెంట్తో క్లోజ్‌గా ఉండటం వల్ల.. ఆయన ఫ్యామిలీలో గొడవలు వచ్చాయనేది గాసిప్ ల సారాశం. ఐతే, ఈ ప్రచారాన్ని బాబా భాస్కర్ కొట్టేశారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా మాట్లాడుతూ.. మా ఇంట్లో గొడవలు ఏమీ లేవు. ఆనందంగా ఉన్నాం అన్నారు. ఇక బిగ్ బాస్ 3 విజేతగా శ్రీముఖి, వరుణ్ సందేష్, రాహుల్ లలో ఒకరు నిలుస్తారని అనుకొన్నా. రాహుల్ నిలిచారు. సంతోషంగా ఉందన్నారు.