సరిలేరు తర్వాత ఆమె చేసే సినిమాలివే.. !

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆమె మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. ఇందులో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. దీపావళీ కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో విజయశాంతి హుందాగా కనిపించారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఇప్పటికే విజయశాంతికి డిమాండ్ పెరిగింది. 

ఆమె కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మా సినిమాలో నటించమని కోరుతున్నారు.
పారితోషికం అడిగినంత ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారట. విజయశాంతి మాత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కానివ్వండీ.. ఆ తర్వాత చూద్దామని కూల్ గా చెబుతున్నారట. సరిలేరు ఫలితం తర్వాతే వరుసగా సినిమాలు చేయడంపై ఆమె నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్ ని సంప్రదించిన వారిలో బడా దర్శక-నిర్మాతలు ఉన్నట్టు సమాచారమ్.