తహసీల్దార్ దారుణ హత్య వెనక పొలిటికల్ కోణం ?

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య అందరిని కలచి వేస్తోంది. ఇంతకీ హంతకుడు కూర సురేష్ ఇంత దారుణానికి పాల్పడటం వెనక అసలు కారణలేంటీ ? తెలుసుకొనే క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చినట్టు సమాచారమ్.
ముందెన్నడూ కూర సురేష్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని కుటుంబసభ్యులు తేల్చి చెబుతున్నారు. అసలు వివాదంలో ఉన్న భూమికి సంబంధించి కనీస అవగాహన ఆయనకి లేదని స్పష్టం చేస్తున్నారు. 

మరి.. సురేష్ కు తహసీల్దార్  విజయారెడ్డిపై ఎందుకంత కోపం ? దీనిపై సురేష్ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు షాక్ కి గురి చేస్తున్నాయి. సురేష్ ది రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్థత్వం. ఆయన్ని ఎవరో రెచ్చగొట్టి ఉంటారని చెప్పారు. ఆ అవసరం ఎవరికి ఉంది ? అంటే.. ఈ భూములపై ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ కన్ను పడింది. ఓ కీలక ప్రజాప్రతినిధి సాయంతో సదరు సంస్థ రంగంలోకి దిగింది.
ఒత్తిడి తెచ్చి విక్రయించేలా రైతులతో ఒప్పందం చేసుకుందని గ్రామస్థులు చెప్పినట్టు తెలిసింది. 

అంతేకాదు.. విజయారెడ్డిని సజీవదహనం చేసే ముందు సురేష్ చాలాసార్లు పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
భూవివాదాన్ని పరిష్కరించనందుకు నిరసనగా పెట్రోల్ తో తహసీల్దార్ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని సురేష్ ను పంపించినట్లు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాగ్వాదం జరగడంతో క్షణికావేశంలో ఇంతటి దారుణానికి ఉంటాడని అనుమానిస్తున్నారు. సురేష్ పెదనాన్న దుర్గయ్యని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి పక్కనున్న 7ఎకరాల భూవివాదంలో ఉందని దుర్గయ్య పోలీసులకి చెప్పినట్టు సమాచారమ్.