రాహుల్-పునర్నవి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్

బిగ్ బాస్ 3లో రాహుల్-పునర్నవిల మధ్య కెమిస్ట్రీనే హైలైట్. సీజన్ మొత్తంలో వీరి రొమాన్స్ గురించే బిగ్ బాస్ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకొన్నారు. రాహుల్ బిగ్ బాస్ ఫైనల్ కు చేరడం, విజేతగా నిలవడం వెనక ప్రధాన కారణం పునర్నవి అని చెప్పుకొంటున్నారు. ఈ విషయాన్ని రాహుల్ కూడా అంగీకరించారు. మరోవైపు, రాహుల్-పునర్నవిలకి పెళ్లి చేయడానికి తమకేం అభ్యంతరం లేదని రాహుల్ తల్లిదండ్రులు అన్నారు. వాళ్లు నిజంగానే ప్రేమించుకొంటే పెళ్లికి మేం ఓకే అన్నారు.
 
రాహుల్, పునర్నవి లు మాత్రం తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. తనని పునర్నవి చాలా ఎంకరేజ్ చేసింది. బతిమాలాడింది. తిట్టింది.. కొట్టి కూడా తనతో టాస్క్ లు చేయించిందని చెప్పారు. ఆమెతో ప్రేమ విషయం గురించి అడిగితే.. బిగ్ బాస్ ఇంట్లోనే పునర్నవికి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకి ఆల్రెడీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. ఆమె నాకు ప్రాణ స్నేహితురాలు. అంతకంటే ఎక్కువ అన్నారు.