విశ్రాంతి తీసుకొంటున్న రానా !


యంగ్ హీరో రానా దగ్గుపాటి ఆరోగ్యంపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పుకొంటున్నారు. ప్రచారం జరిగినంత కాదు. కానీ.. కొన్నాళ్లుగా  రానాకిడ్నీలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి అమెరికాలో అతడికి ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల కాలంలో రానా బయటకనిపించింది చాలా తక్కువ. నిన్న విశ్వసక్ సేన్ తో కలిసి కనిపించారు. రానా మొహంలో నీరసం కనిపించింది. నిజంగానే రానా ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నాడు. మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు.

ఈ నేపథ్యంలో  విరాటపర్వం సినిమా షూటింగ్ ఆగిపోయింది. 1980ల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన నక్సలిజంను నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. వరంగల్ పల్లెలో జరిగిన ఓ యదార్థ గాథకు ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీస్తున్నాడు. ఇందులో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. మొన్నటివరకు రానా లేకపోయినా షూటింగ్ కానిచ్చారు. సాయిపల్లవి పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తిచేశారు. కానీ రానా లేకుండా ఇక షూటింగ్ నడవదు. ఆ సర్జరీ నుంచి కోలుకుంటున్న రానా.. మరో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. దీంతో డిసెంబర్ 1 వరకు విరాటపర్వం షూటింగ్ ఆగిపోయినట్టే.