ఆర్టీసీ కార్మికుల వెనక బీజేపీ.. !?


తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అదరడం లేదు. బెదరడం లేడు. విధుల్లో చేరండి.. ఈ నెల 5 అర్థరాత్రి వరకు డెడ్ లైన్ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఒకటికి రెండు సార్లు మొత్తుకొన్న పెడచెవిన పెట్టారు. డెడ్ లైన్ కి బయపడి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య కేవలం 360మంది మాత్రమే. ఇందులో అత్యధికులు (200) హైదరాబాద్ బస్ భవన్ లోని పారిపాలన సిబ్బందే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ కార్మికులు తలొగ్గలేదు. దీంతో ముందుగానే చెప్పినట్టుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేస్తారా ? అనేది చూడాలి. ఈ విషయం పక్కనపెడితే.. కార్మికుల మొండి ధైర్యం వెనక ఉన్నది ఎవరు ?

ఇప్పుడీ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ కార్మికుల వెనక భాజాపా ఉందని సమాచారమ్. అందుకే.. సీఎం కేసీఆర్ బెదిరింపులకి ఏమాత్రం భయపడేది లేదు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అంటూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వర్థామరెడ్డి అన్నారు. అంతేకాదు.. భవిష్యత్ కార్యచరణ కోసం ఆర్టీసీ జేఏసీ నాయకులు మరికొద్దిసేపట్లో తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ కార్మికుల ధైర్యం వెనక ఉన్న ది భాజాపానే. తెలంగాణలో బలపడేందుకు ప్రయతిస్తున్న భాజాపా ఆర్టీసీ సమ్మెని ఓ అవకాశంగా తీసుకుంటుందనే విషయం అర్థమవుతోంది. మరీ.. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులని న్యాయం చేయగలరా ? అన్నది ఆసక్తిగా మారింది. నిజంగానే బీజేపీ వలన ఆర్టీసీ కార్మికులని న్యాయం జరిగితే.. ఆ పార్టీకి తెలంగాణలో మరింత ఊపు వచ్చినట్టు అవుతుందని చెప్పవచ్చు