ఫేస్ బుక్ కొత్త లోగో చూశారా.. ?
ఫేస్ బుక్ తన లోగోను మార్చింది. ఇదివరకు ‘ఫేస్ బుక్’ అనే ఆంగ్ల అక్షరాలు స్టయిలీష్ తో లోగో ఉండేది. తాజా లోగోలో ఫేస్ బుక్ అనే ఆంగ్ల అక్షరాలని క్యాపిటల్ అక్షరాలుగా చేసి.. కొత్త ఫాంట్ లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చలతో పాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలగలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది.
ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లు ఫేస్ బుక్ కు చెందినవవే. ఈ విషయం కేవలం 29 శాతం మంది అమెరికన్లు మాత్రమే తెలుసని ఇటీవలే ఓ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ కొత్త లోగోని తీసుకొచ్చింది. ఈ కొత్త లోగోతో ఫేస్ బుక్ కి చెందిన వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ యాప్స్ విషయంలో వినియోగదారులకి మరింత క్లారిటీ ఇచ్చింది. నీలం-ఫేస్ బుక్, ఆకుపచ్చ-వాట్సప్, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్ స్టాగ్రామ్ రంగులతో స్పష్టత నిచ్చేలా ఈ లోగోను తీర్చిదిద్దినట్లు అనిపిస్తోంది.