లక్ష్మీ పార్వతీకి పదవొచ్చింది !
వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతీకి కీలక పదవి దక్కింది. ఆమెని ‘తెలుగు అకాడమీ చైర్‌పర్సన్’గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ లక్ష్మీ పార్వతీ ప్రాధాన్యత గురించి తెలిసిందే. ఆమె చాన్నాళ్ల నుంచి తెదేపా అధినేత చంద్రబాబుపై పోరాడు వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ గెలుపును ఆకాంక్షిస్తూ తన వంతు కృషి చేసింది. ముఖ్యంగా చంద్రబాబు, ఎన్ టీఆర్ ఫ్యామిలీకి ధీటైనా సమాధానం ఇస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారామె.
ఐతే, జగన్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మీ పార్వతీ సైలైంట్ అయిపోయారు. మునుపటి ఫైర్ ఆమెలో కనిపించలేదు. అసలు మీడియా ముందుకు రావడమే మానేశారు. తన కష్టాన్ని సీఎం జగన్ గుర్తించలేదనే బాధతోనే ఆమె పార్టీకి దూరంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఐతే, కాస్త లేటైనా జగన్ ప్రభుత్వం లక్ష్మీ పార్వతీ గుడ్ న్యూస్ అందించింది. ఆమెని ‘తెలుగు అకాడమీ చైర్‌పర్సన్’గా నియమించారు. దీనిపై లక్ష్మీ పార్వతీ ఎలా రియాక్ట్ అవుతారు ? అన్నది చూడాలి.