విజయ్ దేవరకొండ అనుభవం చూస్తున్నాడు !

అవును.. విజయ్ దేవకొండ అనుభవం చూపిస్తున్నాడు. ఇన్నాళ్లు విజయ్ కొత్త దర్శకులకి పెద్దపీఠ వేశారు. ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశారు. అలా చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా సూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో ప్లాపులు కూడా పలకరించాయి. నోటా, డియర్ కామ్రెడ్ సినిమాల ప్లాప్ తో విజయ్ కి అనుభవంలోకి వచ్చింది. ఇకపై అనుభవం ఉన్న దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ సినిమాని ఓకే చేశారు.

ఈ సినిమా తర్వాత విజయ్ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో ఉండనుంది. నిన్నుకోరి, మజిలీ లాంటి సినిమాలు తీసిన అనుభవం శివకు ఉంది. వాస్తవానికి పూరి సినిమాకి ముందు లేదా వెనక ఓ కొత్త దర్శకుడితో విజయ్ సినిమా చేయాల్సి ఉందట. కానీ, డియర్ కామ్రెడ్ సినిమా తెచ్చిన అనుభవం దృష్ట్యా.. కాస్త అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలని శివ నిర్వాణ సినిమాని కాస్త ముందుకు లాగినట్టు తెలుస్తొంది. మొత్తానికి.. విజయ్ దేవరకొండ అనుభవం చూపిస్తున్నారు.