ఆర్టీసీపై కేంద్రం మాట.. ఏంటంటే ?

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారం థ్రిల్లర్ సినిమాలా అన్యూహ్య మలుపులు తిరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ (నవంబర్ 5) ముగిసింది. ఇక ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు సీఎం కేసీఆర్ సీరియస్ గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అనుకొన్నారు. కానీ, అది అంత ఈజీ పని కాదని గురువారం ఆర్టీసీ వ్యవహారంపై హైకోర్టు విచారణతో అర్థమైంది. అసలు ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు. ఈ విషయాన్ని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఆయన గురువారం హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.

ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి ఇంకా కాలేదు. అసలు టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదు. ఏపీఎస్ ఆర్టీసీలోనే కేంద్రానికి 33 శాతం వాటా ఉంది.  ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా టీఎస్ ఆర్టీసీకి బదిలీ కాదని, ఆర్టీసీ పునర్ వ్యవస్థీకరణకు తమ అనుమతి కోరలేదని కేంద్రం తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. విభజన పెండింగ్ లో ఉందంటున్నారు.. కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామంటున్నారు. విభజన పెండింగ్ లో ఉన్నప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. మొత్తానికి.. స్టీరింగ్ కేంద్రం చేతిలో ఉందని క్లారిటీ వచ్చింది. అందుకే తెలంగాణ భాజాపా మద్దతుతో ఆర్టీసీ జేఏసీ చాలా గట్టిగానే ప్రభుత్వంతో పోరాడుతున్నట్టు కనబడుతోంది.