‘దర్భార్’ (తెలుగు) మోషన్ పోస్టర్.. అదిరింది !

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘దర్భార్’. నయనతార కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో దర్భార్ తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న తమిళ్ తో పాటు తెలుగులోనూ ‘దర్భార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో రజనీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తాజాగా దర్భార్ తెలుగు వర్షన్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. రజనీ తనదైన స్టయిల్ లో రౌడీలని రఫ్ఫాడిస్తున్న సీన్ ని మోషన్ మోస్టర్ గా వదిలారు. ఇందులో రజనీ చాలా స్టయిలీష్ గా కనిపిస్తున్నారు. అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, సంక్రాంతి సీజన్ లో రజనీ ‘దర్భార్’తో టాలీవుడ్ స్టార్స్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాలు పోటీ పడనున్నాయ్.