రాహుల్-శ్రీముఖి ఇప్పటికీ గొడవలే.. !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ విజేత నిలిచారు. బిగ్ బాస్ ఇంట్లో శ్రీముఖి  వర్సస్ రాహుల్ వార్ బయట కూడా కొనసాగుతుందని సమచారమ్. రాహుల్ విజేతగా నిలిచిన తర్వాత శ్రీముఖి రాహుల్ కి కంగ్రాట్స్ చెప్పలేదని.. అది ఆమె గుణానికి నిదర్శమని రాహుల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 
శ్రీముఖి అభిమానులు ఏం తక్కువ తినలే. రాహుల్ ఫేక్ విన్నర్..  ఆయన  బయట 10 లక్షలకు డీల్ సెట్ చేసుకున్నాడని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని శ్రీముఖి అభిమానులు అంటున్నారు. అదే విధంగా ఇలాంటి డీల్స్ కోసం మీరే మాట్లాడాలి లక్షలు ఖర్చు పెట్టి థియేటర్స్ లో యాడ్స్ వేయించుకొని ఒక రేంజ్ లో ప్రమోషన్స్ జరుపుకున్నారని రాహుల్ అభిమానులు ఫైర అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీముఖి వర్సెస్ రాహుల్ హీట్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.