బిగ్ బాస్ 3 : విన్నర్ కంటే లూజర్’కే ఎక్కువ డబ్బులు
బిగ్ బాస్ తెలుగు సీజన్-3 విజయవంతంగా ముగిసింది. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు. ఐతే, విన్నర్ కంటే రన్నర్ కే బిగ్ బాస్ యాజమాన్యం ఎక్కువ పారితోషికం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ నే చెప్పాడు. బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన తర్వాత ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
ప్రైజ్ మణిగా రూ. 50 లక్షలు గెలుచుకొన్నారు. దానికితోడు భారీ రెమ్యూనరేషన్ ముట్టి ఉంటుందని రాహుల్ ని అడగగా.. మీరు అనుకొంటున్నట్టు నాకు భారీగా రెమ్యూనరేషన్ ఏమీ ఇవ్వలేదు. శ్రీముఖిలా రోజుకి లక్ష తీసుకోలేదు. చాలా తక్కువ తీసుకొన్నా. తనకి వారం వారం రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అదికూడా నేను బయటి ప్రొగ్రామ్స్ చేస్తే వచ్చే రేంజ్ లోనే. అది ఎంత ? అనేది నా పర్సనల్. బయటికి చెప్పలేను. ఇక ప్రైజ్ మణిగా గెలిచిన రూ. 50లక్షల్లో రూ.15లక్షలు టాక్స్ లలో రూపంలోనే పోయాయ్. చేతికి రూ. 35లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పాడు. వాటితో తల్లిదండ్రుల కోసం సొంతింటిని కొంటానని చెప్పారు.
ఇక బిగ్ బాస్ 3లో పాల్గొన్న సభ్యుల్లో కోటి రూపాయలు అందుకొన్నవారు ఉన్నారు. శ్రీముఖికి రోజుకో లక్ష చొప్పన వందరోజులకి రూ. కోటి వరకు అందుకొంది. దానికి రన్నరప్ గా నిలిచినందుకు వచ్చిన ప్రైజ్ మణి అదనం. వరుణ్ సందేష్ కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఆయనకి దాదాపు రూ. కోటి ముట్టాయట. ఇక ఒకేవారం బిగ్ బాస్ ఇంట్లో గడిపిన నటి హేమ 9.6లక్షలు తీసుకొన్నట్టు సమాచారమ్.
అంతకుమించి బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న నటుడు సమీర్ అత్యధికంగా రోజుకు రూ. లక్ష తీసుకొన్నారట. మొత్తానికి.. బిగ్ బాస్ క్రేజ్ ని బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చాడన్నమాట. ఈ లెక్కన విజేటగా నిల్చినవారి కంటే మిగితావారే అధిక రెమ్యూనరేషన్ పొందారని చెప్పవచ్చు.