‘డిస్కోరాజా’ బర్త్ డే గిఫ్ట్’గా రాబోతున్నాడు !

వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్ పుత్, నభా నటాషా, తాన్యా హోప్ హీరోయిన్స్. తమిళ నటుడు బాబీ సింహా ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. ‘డిస్కోరాజా’ డిసెంబర్ 20న రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడీ సినిమా వచ్చే యేడాది జనవరికి వెళ్లింది. అలాగని సంక్రాంతికి రావడం లేదు. సంక్రాంతి తరువాత అంటే జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకీ డిస్కోరాజా ఎందుకు వెనకడుగు వేసినట్టు ?

దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి నవంబర్ 18 నాటికి సినిమా షూటింగ్ పూర్తికానుంది. ఆ తర్వాత హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలి. పైగా విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉందట. ఈ నేథ్యంలో క్వాలిటీ అవుట్‌పుట్ కోసం కాస్త లేటయినా పర్వాలేదని డిస్కోరాజా జనవరికి వెళ్లాడు. ఇక రెండో కారణం ఏంటంటే ? జనవరి 26న రవితేజ బర్త్ డే. జనవరి 24 అయితే రవితేజ అభిమానులకి బర్త్ డే కానుక ఇచ్చినట్టు ఉంటుందని భావించారు. డిస్కోరాజా జనవరి 24కి వెళ్లడంతో డిసెంబర్ 20న వచ్చే ప్రతిరోజు పండగ, రూలర్ లతో సంక్రాంతి సినిమాలు అల.., సరిలేరులకి ఏ ఇబ్బంది లేకుండా అయిందని చెప్పవచ్చు.

ఇక ‘డిస్కోరాజా’ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా విజయం సాధించడం చాలా ముఖ్యం. మరీ.. డిస్కోరాజా ఏం చేస్తాడో చూడాలి.