మంచివాడు జనవరి15కి ఫిక్సయ్యాడు !

నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఎంతమంచివాడో ఈ సంక్రాంతికి తెలిసిపోనుంది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ఎంతమంచివాడవురా!.  మెహ్రీన్ కథానాయిక. సతీష్ వేగ్నేశ దర్శకుడు. మొదటి నుంచి మంచివాడు సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది కూడా జనవరి15కే అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ‘ఎంతమంచివాడవురా’ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో కల్యాణ్ రామ్ చాలా మంచివాడిలా కనిపిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు అల.. వైకుంఠప్రురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకొన్నాయి. ఈ రెండు కూడా జనవరి 12నే రాబోతున్నాయి. అయితే, రెండ్రోజుల గ్యాప్ తో వచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్. అవి సఫలమైతే.. జనవరి10 ఒకరు, జనవరి 12న మరొకరు రావొచ్చు. డిస్కోరాజా సంక్రాంతి తర్వాత జనవరి 24న రాబోతున్నట్టు  కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇక తేలాల్సింది వెంకీమామ విడుదల ఎప్పుడు ? అన్నది. వెంకీమామ డిసెంబర్ 6 లేదా డిసెంబర్ 25న వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారమ్.