అసలు.. రమ్యకృష్ణ రొమాంటిక్ కాదు !

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రొమాటింక్ కాదట. దర్శకుడు పూరి తనయుడు ఆకాష్ హీరోగా ‘రొమాంటిక్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే పూరి అందించారు. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ జోడిగా కేతిక శర్మ నటిస్తున్నారు. ఇప్పటికే రొమాంటిక్ ఫస్ట్ లుక్ ని వదిలారు. ఇందులో అర్థనగ్నంగా కేతిక ఆకాష్ ని హగ్ చేసుకోవడం చూపించారు. పూర్తిగా బ్యాక్ అందాలని చూపించారు. అది రొమాంటిక్ అనడం కంటే బోల్డ్ అనొచ్చేమో. 

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిరా బేడీని అనుకొన్నారట. ఆమెతో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఐతే, మందిరాలోని రొమాంటిక్ యాంగిల్ చిత్రబృందానికి నచ్చలేదట. అదే సమయంలో రమ్యకృష్ణ ని సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. దీంతో మందిరా బేడీ స్థానంలో రమ్యకృష్ణని తీసుకొన్నారు. అంతేకాదు.. ఇందులో రమ్యకృష్ణ రొమాంటిక్ పాత్రలో కనిపించదు. ఆమె పవర్ ఫుల్ పాత్రలో మెరవనుంది.