రివ్యూ : తిప్పరా మీసం
చిత్రం : తిప్పరా మీసం (2019)
నటీనటులు : శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి తదితరులు
సంగీతం : సురేశ్ బొబ్బిలి
దర్శకుడు : ఎల్ కృష్ణవిజయ్
నిర్మాత : రిజ్వాన్
రిలీజ్ డేటు : 8నవంబర్, 2019
నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న శ్రీ విష్ణు హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో ఉన్నారు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొంటున్నారు. ఈ యేడాది ఆయన నటించిన ‘బ్రోచెదెవరురా’ మంచి విజయాన్ని అందుకొంది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఆయన తాజా చిత్రం ‘తిప్పరా మీసం’. ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహించారు. నిక్కీ తంబోలీ హీరోయిన్. సీనియర్ నటి రోహిణి శ్రీవిష్ణు తల్లి పాత్రలో నటించింది. టీజర్, ట్రైలర్ తో ఇది కూడా వైవిధ్యమైన సినిమా అనిపించింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా లక్షణాలు కనిపించాయ్. మరీ.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన తిప్పరా మీసం ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
డ్రగ్స్, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడు మణిశంకర్ (శ్రీవిష్ణు) కథ ఇది. వదిలేస్తే.. డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) మణిని రిహాబిటేషన్ సెంటర్లో చేరుస్తోంది. దాంతో తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం తల్లిపైనే కేసు వేస్తాడు. ఓ మర్డర్ కేసులో ఇరుకొంటాడు. ఆ తర్వాత ఏమైంది ? మణి తల్లి ప్రేమని అర్థం చేసుకొన్నాడా ? మణి ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నది మిగితా కథ.
ఫ్లస్ పాయింట్స్ :
* శ్రీ విష్ణు, రోహిణిల నటన
* నేపథ్య సంగీతం
* మదర్ సెంటిమెంట్
మైనస్ పాయింట్స్ :
* తొలిభాగం
* స్లో నేరేషన్
* రన్ టైం
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
తల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు మంచి విజయాలు నమోదు చేసిన సందర్భాలున్నాయ్. తిప్పరా మీసం కూడా మదర్ సెంటిమెంట్ తో తీసిన చిత్రమే. ఐతే, దర్శకుడు తల్లిసెంటిమెంట్ కంటే ఊరమాస్ అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. హీరో శ్రీవిష్ణు పాత్రని బాగా చూపించాడు. ఫస్టాఫ్ అంతా శ్రీ విష్ణు పాత్ర తీరుతెన్నులని చూపించడానికే తీసుకొన్నాడు. ఇంటర్వెల్ ఏపీసోడ్ నుంచి సినిమా వేగం పుంజుకుంది. సెకాంఢాప్ ని బాగా నడిపించింది. ఆఖరి 30 నిమిషాలు సినిమా మరింత బాగుంది. ఐతే, ఆ లోపే ప్రేక్షకుడు కథతో డిస్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. మొదటి నుంచి కథ-కథనాలు ఇంకాస్త గ్రిప్పింగ్ నడిపిస్తే బాగుండేది.
సినిమా రన్ టైమ్ కూడా మైనస్ అయింది. దాదాపు మూడు గంటల సినిమా ఇది. బహుశా.. అర్జున్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొన్నారు. రన్ టైం, హీరో పాత్రని అదే విధంగా డిజైన్ చేశారు. ఐతే, అర్జున్ రెడ్డిలోని మేజిక్ ఇందులో కనిపించదు. ఇక నటనతో శ్రీవిష్ణు మరోసారి ఆకట్టుకొన్నాడు. ఊరమాస్ పాత్రలో అదరగొట్టేశాడు. గడ్డెంలుక్ లో అర్జున్ రెడ్డిని గుర్తు చేశాడు. తల్లి పాత్రలో రోహిణి ఒదిగిపోయింది. ఆమె నటన సినిమాకి ప్రధానబలం. హీరోయిన్ కి నటించే స్కోప్ పెద్దగా లేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగితా నటీనటులు
ఫర్వాలేదనిపించారు.
సాంకేతికంగా :
3 గంటల సినిమా అంటే సాహసమే. ఇలాంటి సాహాసం చేసేటప్పుడు కథ-కథనాలు గ్రిప్పింగా సాగాలి. సినిమాలో మేజిక్ వర్కవుట్ కావాలి. అప్పుడు ప్రేక్షకుడిని మూడు గంటల పాటు థియేటర్ లో కూర్చొబెట్టి మెప్పించి పంపించవచ్చు. అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాల్లో ఆ మేజిక్ వర్కవుట్ అయింది. తిప్పరా మీసం సినిమాలో రన్ టైం ఓ మైనస్ గా నిలిచిందని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో సినిమా బాగుంది. కానీ ఆలోపే ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేశాడు. అది పెద్ద మైనస్ అయింది. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకొంది. నిర్మాణ
విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.75/5