పబ్లిక్ టాక్ : తిప్పరా మీసం మరో అర్జున్ రెడ్డి

ప్రయోగాలు చేయడమే పనిగా పెట్టుకొన్నాడు శ్రీవిష్ణు. ఈ క్రమంలో విజయాలు అందుకొంటున్నాడు. ఆయన చేసిన తాజా ప్రయోగం ‘తిప్పరా మీసం’. క్లాస్ గా కనిపించే శ్రీ విష్ణు ఈ సినిమా కోసం ఊరమాస్ లుక్ లోకి మారిపోయాడు. లుక్ ఒకటి కాదు.. నటన నాటుగానే ఉండబోతుందని టీజర్, ట్రైలర్ ని చూస్తే అర్థమయింది. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కృష్ణవిజయ్ దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణుకి జంటగా నిక్కీ తంబోలి నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తిప్పరా మీసం’ సినిమా మరో ‘అర్జున్ రెడ్డి’ అంటున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అంటున్నారు. ఇది కూడా అర్జున్ రెడ్డి మాదిరిగా దాదాపు 3గంటల సినిమా. కథ-కథనాలు కొత్తగా ఉన్నాయి.

ఫస్టాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ ని చూపించడానికే ఎక్కువ సమయం తీసుకొన్నారని సినిమా చేసిన ప్రేక్షకులు చెబుతున్నారు. డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి కథే తిప్పరామీసం. అయితే ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ హైలైట్. శ్రీ విష్ణు తల్లి పాత్రలో రోహిణి నటించారు. తొలిభాగంలో శ్రీవిష్ణు కారెక్టర్ ని చూపించిన దర్శకుడు.. సెకాంఢాఫ్ లో శ్రీవిష్ణు ప్రేమ, తల్లి సెంటిమెంట్ తో ఆసక్తికరంగా కథని నడిపించాడట. ఫస్టాఫ్ సాదాసీదాగా అనిపించినా..  ఇంటర్వెల్ ఏపీసోడ్ అదిరింది. ఇక సెకాంఢాఫ్ సినిమా అదిరిపోయింది. కోర్టు సన్నివేశాలు, బెట్టింగ్ గేమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఏపీసోడ్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. అర్జున్ రెడ్డితో పోలిక మాత్రమే కాదు. ఆ రేంజ్ హిట్ ఖాయం అంటున్నారు.