బ్రేకింగ్ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పుని వెలువరిస్తోంది. అయోధ్య వివాద స్థలాన్ని సుప్రీం హిందువులకి కేటాయిస్తూ తీర్పునిచ్చింది. ఇక ముస్లింల కోసం ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలి. అది కూడా అయోధ్యలోనే ఐదెకరాల స్థలం కేటాయించాలని సుప్రీం సూచింది.

 మొత్తానికి.. ఎలాంటి వివాదాలకి తావులేకుండా అయోధ్య వివాదాస్థలాన్ని హిందువులకి కెటాయిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. అదే సమయంలో ముస్లింల మనోభావలని దెబ్బతీయకుండా సుప్రీం తీర్పునిచ్చింది. అయోధ్య వివాద స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని సుప్రీం కోర్టు తీర్పినిచ్చింది. అంతేకాదు.. మూడు నెలల్లో ఓ కమిటి వేసి రామమందిర నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఇక ముస్లింలకి కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలాన్ని సన్నీ బోర్డుకు అప్పగించాలని తీర్పునిచ్చింది. 1993లో సేకరించిన భూమిలో కూడా ఇవొచ్చని తెలిపింది.