లైవ్ : అయోధ్య కేసు తుది తీర్పు

అయోధ్య వివాదం 134 యేళ్లుగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా నలుగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతం (2.77ఎకరాలు) తమదంటే తమదంటూ హిందూ- ముస్లింలు గొడవపడుతుననరు. దీనిపై ఎన్నెన్నో కోర్టు కేసులు, మరెన్నో వివాదాలు నడిచాయి. ఫైనల్ గా నేడు సుప్రీంకోర్టు తుదితీర్పు వెల్లడిస్తోంది. ఆ విశేషాలు లైవ్ లో మీ కోసం.. !

* అయోధ్య వివాద స్థలాన్ని సుప్రీం హిందువులకి కేటాయిస్తూ తీర్పునిచ్చింది

* అయోధ్యలోనే ముస్లిం నిర్మాణానికి ఐదెకరాల స్థలం

* ముస్లింలకి ప్రత్యామ్నాయ స్థలం

* అయోధ్య రామజన్మస్థలం అనే అంశంపై ఏకాభిప్రాయం

* నిర్మొహి పిటిషన్ కొట్టివేత

* తీర్పుని చదివేందుకు అరగంట సమయం పట్టనుంది

* తీర్పుపై ఐదుగురు జడ్జీల ఏకాభిప్రాయం

* షియా పిటిషన్ కొట్టివేత. 

* అయోధ్య తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై అధికారులు దృష్టిసారించారు. దీని కోసం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనవసర సందేశాల మీద నిశిత పరిశీలన చేయనున్నారు.

* మధ్యవర్తిత్వ సంఘం ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాజకీయంగా సున్నితమైన ఈ కేసు కోసం ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్  భూషణ్ , జస్టిస్ అబ్దుల్ జీర్ లతో కూడిన ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. ఏకబిగిన 40 రోజుల పాటు విచారణ జరిపి, గత నెల 16న తీర్పును వాయిదా వేసింది. ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ గొగొయి అసాధారణ రీతిలో న్యాయస్థానానికి సెలవు రోజైన శనివారం తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు