ఈ అంశాల ఆధారంగానే అయోధ్య తీర్పు !

సుదీర్ఘంగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పుని వెలువరిస్తోంది. అయోధ్య వివాదాస్పద స్థలం (2.77ఎకరాలు) హిందువులకే కేటాయించింది. ఆ స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని సుప్రీం కోర్టు తీర్పినిచ్చింది. ఇక ముస్లింలకి ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఈ భూమిని సన్నీ బోర్డుకు అప్పగించాలని తీర్పునిచ్చింది. మరీ.. సుప్రీం ఏ అంశాల ఆధారంగా సుప్రీం తీర్పునిచ్చిది ? 

ఆస్థి తగాదాని నమ్మకాలు, విశ్వాసాల పరంగా కాకుండా సాక్ష్యాల ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆర్కలాజికల్ సర్వే ఇండియా ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా తీర్పుని వెలువరించింది. ఈ నేపథ్యంలోనే రామ్ లాల, సున్నీ వక్స్ బోర్డ్ పిటిషన్స్ కోర్టు కొట్టేసింది. ఆర్కలాజికల్ సర్వే ఇండియా ఏ రిపోర్ట్ ఇచ్చిందో.. ఆ రిపోర్ట్ లో ఏదైతే ఉందో దాని ఆధారంగానే సుప్రీం తీర్పునిచ్చింది.

మసీద్ నిర్మాణం అన్నది ఖాళీ స్థలంలో జరగలేదు. అలాగే మసీద్ నిర్మాణం క్రింద ఇస్లాంమిక్ ఆనవాలు ఉన్నట్టు ఏమీ కనిపించలేదు.
అలా అని చెప్పి ఓ మందిరాన్ని తొలగించి అక్కడ మసీద్ కట్టారనే ఆధారాలేవీ లేవు. కానీ, 1956 నుంచి 1957 సమయంలో హిందువులు అక్కడ పూజ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవనే విషయాన్ని ఆర్కలాజికల్ సర్వే ఇండియా రిపోర్టులో పేర్కొంది.  వీటిన్నంటి ఆధారంగా వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని రామ్ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ కి ఇవ్వాలని చెప్పింది.  ఇక ముస్లింల కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం కేటాయించాలి. అది కూడా అయోధ్యలోనే ఐదెకరాల స్థలం కేటాయించాలని సుప్రీం తీర్పునిచ్చింది. ఆ స్థలాన్ని సన్నీ బోర్డుకు అప్పగించాలని తీర్పునిచ్చింది. 1993లో సేకరించిన భూమిలో కూడా ఇవొచ్చని తెలిపింది.