బీజేపీలోకి గంటా.. ముహూర్తం ఫిక్స్ ?

ఏపీలో టీడీపీ ఖాళీ కాబోతుందా ? ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు భాజాపా గూటికి చేరబోతున్నారా ?? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ భాజాపా వర్గాలు. తెదేపా కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీ మార్పుపై కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలొచ్చాయ్. కానీ ఆయన టర్న్ తీసుకొని భాజాపా వైపు వచ్చారు.

 ప్రస్తుతం గంటా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్‌, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో గంటా పలుమార్లు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ చర్చలు ఫలించాయ్. గంటా కమలం గూటికి చేరడం ఖాయమైందని సమాచారమ్. గంటాతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యే కూడా తెదేపాని వీడి భాజాపాలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వీరు భాజాపాలో చేరడం వెనక మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం కూడా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరీ.. గంటా అండ్  కో ఎప్పుడు భాజాపాలో చేరబోతున్నారు. ప్రస్తుతం దేశంలో అయోధ్య తుది తీర్పు హీట్ ఉంది. అది చల్లబడ్డాక గంటా కాషాయం కండువ కంపుకోనున్నారు.