అయోధ్య తుది తీర్పుపై కేటీఆర్ ట్విట్

అయోధ్య వివాదం 134 యేళ్లుగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా నలుగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతం (2.77ఎకరాలు) తమదంటే తమదంటూ హిందూ- ముస్లింలు గొడవపడుతుననరు. దీనిపై ఎన్నెన్నో కోర్టు కేసులు, మరెన్నో వివాదాలు నడిచాయి. ఫైనల్ గా నేడు తుదితీర్పు వెలువడనుంది. మరికొద్దిసేపట్లో అంటే ఈ ఉదయం 10:30నిమిషాలకి అయోధ్యపై సుప్రీ కోర్టు తుదితీర్పుని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏదైనా సంయమనం పాటించాలని మతపెద్దలు, రాజకీయ నాయకులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్విట్ చేశారు.
 
అయోధ్య తుది తీర్పుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉన్నా శాంతి, జ్ఞానం విలసిల్లుతుందనే ఆశాభావాన్నికేటీఆర్ వ్యక్తం చేశారు. తాను ఏడాది క్రితమే ఈ అంశంపై ఒక ప్రసార మాధ్యమం ముఖాముఖిలో తన అభిప్రాయాన్ని వెల్లడించానని ట్విట్ చేశారు. ఇక అయోధ్య తుది తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లోనూ భారీ భద్రతని ఏర్పాటు చేశారు. కేంద్రం సూచనల మేరకు వారం రోజుల క్రితం నుంచి పటిష్టమైన భద్రత చర్యలు తీసుకొన్నారు.