నరేష్ పై రాజశేఖర్ సటైర్
మా లొల్లికి ఇంకా పులిస్టాప్ పడలేదు. ఈ గొడవ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లింది. ఆయన ఇప్పటికే ఓసారి చర్చలు జరిపారని సమాచారమ్. ఇదిలావుంటే.. సమయం దొరికినప్పుడల్లా.. సీనియర్ రాజశేఖర్ మా అధ్యక్షుడు నరేష్ పై సటైర్స్ వేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇన్ ఫార్మల్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. దీనికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. పదవులు అలంకారం కోసం కాదని, అవి బాధ్యత అన్నారు. మా అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవుల విషయంలో ఎంత బాధ్యతగా మెలగాలో అర్థమైంది. అసోసియేషన్ విషయంలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్రాలను పాలించేవారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాజశేఖర్ మాటలు మా అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేస్తూ చేసినవేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.