ఘనంగా అర్చన సంగీత్ (వీడియో)
నటి అర్చన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్ తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది.ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్ లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు.
వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి చాలా తక్కువమంది అతిథులు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Actress #Archana Sangeeth Function pic.twitter.com/1dpxnJ18aY
— Hyd Movies (@hydmovies) November 11, 2019